తెలంగాణలో పట్టుబిగిస్తున్న బీజేపీ.. ఇవాళ్టి నుంచి మరో కొత్త అంకానికి తెర తీస్తోంది. నేటి నుంచి బీజేపీ ముఖ్యనేతల బైక్‌ ర్యాలీలు నిర్వహించబోతోంది. 'ప్రజా గోస-భాజపా భరోసా' పేరుతో బీజేపీ ఈ బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని ప్లాన్ చేసింది. తొలి విడత 6 నియోజకవర్గాల్లో ఈ బైక్ ర్యాలీలు ఉంటాయి. తొలి విడతలో మొత్తం పది రోజులపాటు ఈ బైక్ ర్యాలీల యాత్రలు ఉంటాయి.

తొలివిడతలో వేములవాడ, సిద్దిపేట, బోధన్‌, నర్సంపేట, జుక్కల్‌, తాండూరు నియోజకవర్గాల్లో బైక్ యాత్రలు ఉంటాయి. ఇవాళ సిద్దిపేటలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బైక్‌ ర్యాలీ ప్రారంభిస్తారు. అలాగే ఈ మధ్యాహ్నం వేములవాడలో బండి సంజయ్‌  బైక్‌ ర్యాలీ ప్రారంభిస్తారు. ఎల్లుండి నుంచి మరో 8 స్థానాల్లో బైక్‌ ర్యాలీలకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. మొత్తానికి తెలంగాణలో బీజేపీ మాత్రం పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp