మన సైన్యానికి సరికొత్త ఆయుధాలు సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది. డ్రోన్ లు, కార్బైన్ లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.  సైన్యం కోసం 28 వేల 732 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు, ఇతర సామాగ్రి కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. తూర్పు లద్దాఖ్ వద్ద... చైనాతో సరిహద్దు సమస్యలు కొనసాగుతున్న సమయంలో ఇలా పెద్ దమొత్తంలో ఆయుధాలు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


ఈ మొత్తంతో సుమారు 4లక్షల బ్యాటిల్ కార్బైన్ లు కొనుగోలు చేయనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా చిన్నపాటి ఆయుధాలు తయారుచేసే సంస్థలకు ఇది గుడ్ న్యూస్‌గా చెప్పొచ్చు.  ఈ నిర్ణయం ఆ సంస్థలకు మంచి ఊపునిస్తుందని రక్షణ శాఖ చెబుతోంది. నియంత్రణ రేఖ వెంబడి భద్రతను చేయవచ్చని.. దీంతో మరింత పటిష్ఠం చేయడం సహా ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న సైన్యానికి రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొననున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: