టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ప‌ర్యట‌న‌పై ఎల్లో మీడియా చేస్తున్న హ‌డావిడిపై వైసీపీ పార్లమెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి చురకలు వేశారు. సోషల్ మీడియా ద్వారా చంద్రబాబుకు, ప‌చ్చ మీడియాపై సెటైర్లు వేశారు. మిలేంగే అని అన్నారో లేదో చంద్రబాబు మళ్ళీ తనకు పాతరోజులు వచ్చినట్టే కలలు కంటున్నాడని విజయసాయిరెడ్డి పోస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులు నిమిషం మాట్లాడినా వెళ్లేటప్పుడు మిలేంగే అనడం సాధారణమని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.


అంటే  దాని అర్థం అప్పుడప్పుడు ఢిల్లీకి రండి అని కాదని.. ఊహలు గుసగుసలాడే’ అన్నట్టు కుల మీడియాతో డప్పు కొట్టిస్తున్నాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. పచ్చ కుల మీడియా ఆనంద పులకింతలు చూస్తుంటే చకోరపక్షి కథలు గుర్తు రావట్లేదూ అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చకోరాలు మేఘాల కోసం చూస్తూ వర్షపు చినుకులు భూమికి చేరక ముందే గాలిలో మాత్రమే తాగుతాయని.. చంద్రబాబు అనే చకోరం పరిస్థితి అలాగే ఉందని వెటకారం ఆడారు. మోదీ గారి పలకరింపు అనే దీనగాథ అంటూ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి సోషల్ మీడియాలో కుమ్మేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: