హీరోయిన్ ఇంద్రజ.. ఎప్పుడో 1990లలో వచ్చిన సినిమాల హీరోయిన్.. కానీ ఇప్పటికీ సినిమాలలోనూ బుల్లితెరపై అలరిస్తూనే ఉంది. ప్రత్యేకించి జబర్దస్త్‌ జడ్జిగా వస్తున్న ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇన్నాళ్లయినా.. ఇంత అందంగా ఎలా ఉన్నారని అడిగితే.. ఇంద్రజ ఇచ్చే సమాధానం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.


తన చేతి నుంచి కోటి  రూపాయల ప్రాజెక్టు పోయినా అది కూడా మన మంచికే అనే భావనతో ఇంద్రజ ఉంటుందట. అలా ఉండటం మనల్ని ఇంకో ఎత్తుకు తీసుకెళ్తుందని ఇంద్రజ చెబుతున్నారు. ఏదైనా నా నుంచి పోయింది.. దాన్ని వాడు తీశాడు.. వీడు తీశాడు అనుకుంటూ  ఆలోచిస్తే ఆ నెగిటివ్ ప్రభావం ఆరోగ్యంపై ఎక్కువగా ఉంటుందట. ఆ నెగిటివ్ ప్రభావంతో శరీరంలో చాలా మార్పులు వస్తాయట. తానెప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తానంటూ తన అందం సీక్రెట్ చెప్పేసింది ఇంద్రజ. అదీ ఇంద్రజ అందం రహస్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: