ఇది రోగాల సీజన్.. అసలే కరోనా, మంకీపాక్స్ వంటి కొత్త రోగాలు వణికిస్తున్న రోజులివి.. ఇప్పుడు పిల్లలను వణికించేందుకు మరో రోగం బయలు దేరింది. అదే టమాటా ఫ్లూ.. కేరళలో వెలుగు చూసిన టమోటా ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌ పిల్లలకే ఎక్కువగా వస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ విషయాన్ని ప్రముఖ వైద్య పత్రిక ద లాన్సెట్‌ తన రీసెంట్ ఎడిషన్‌లో తెలిపింది. అంతే కాదు.. ఈ టమాటా ఫ్లూను నియంత్రించకపోతే.. పెద్దలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందట.


దీన్ని టమోటా ఫ్లూ లేదా టమోటా ఫీవర్‌ అని పిలుస్తుంటారు. ఈ కేసు ఇండియాలో మే 6న కేరళలోని కొల్లం జిల్లాలో వెలుగు చూసింది. రెండు నెలల్లోనే ఈ వ్యాధి మరో 82 మందిలో కనిపించింది.  అయితే వీరంతా ఐదేళ్ల లోపు పిల్లలే కావడం విశేషం. కేరళ, తమిళనాడు, ఒడిశాలోనూ ఈ టమాటా ఫ్లూ కేసులు కనిపిస్తునత్నాయి. బాధితులకు దగ్గరగా ఉండేవారికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అయితే ఇది ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్‌ మాత్రం కాదు. కానీ.. కరోనా అనుభవాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

flu