విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు ఐదో తేదీ వరకు దసరా మహోత్సవాలను అత్యంత వైభవంగా జరగనున్నాయి. దీని కోసం అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరు ఎస్‌.డిల్లీరావు, దేవాదాయ, పోలీసు, రెవెన్యూ, నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్య, రహదారులు, భవనాలు, జలవనరులు, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


కరోనా పరిస్థితులు కుదుటపడిన తరుణంలో ఈ దసరాకు భారీగా భక్తులు తరలి వస్తారనే అంచనా ఉంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యనారాయణ ఆదేశించారు. దసరా సమయంలో ప్రతిరోజు 30 వేల మందికిపైగా భక్తులు  అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. అదే మూలా నక్షత్రం రోజున రెండు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. అలాగే దూరప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: