మన పొరుగున ఉన్న దాయాది దేశం పాకిస్తాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకూ అందుతున్న లెక్కల ప్రకారం.. పాకిస్తాన్‌లో 3 కోట్ల 30 లక్షల మందిపై వరదలు ప్రభావం చూపాయి. ఇప్పటి వరకూ 1100 మంది పైగా వరదల్లో ప్రాణాలు కోల్పోయారు.


పాకిస్తాన్‌లో వరదల కారణంగా 10 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ సైన్యం వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ చర్యలను ముమ్మరం చేసింది. ప్రత్యేకించి పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఒక్క రోజులోనే 120మంది వరకూ మరణించారు. వర్షాల కారణంగా పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు 3450 కిలోమీటర్ల రహదారులు పాడయ్యాయి. 150కి పైగా వంతెనలు వరదల్లో కొట్టుకుపోయాయి. పాకిస్తాన్‌ను ఆదుకోవాలంటూ ఆ దేశ ప్రధాని ఇప్పటికే ప్రపంచ దేశాలను సాయం అడిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: