సినిమా హీరోయిన్ల ఆదాయం భారీగానే ఉంటుంది. కొందరు ఏకంగా హీరోలతో పోటీపడుతుంటారు. సినిమా అవకాశాలే కాదు..మోడలింగ్.. షాపుల ఓపెనింగులు.. ఇలా ఇతర ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి. కానీ.. కొందరు హీరోయిన్లు మాత్రం నైతికంగా దిగజారిపోతుంటారు. డబ్బుకు కక్కుర్తిపడి నానా చెత్త పనులు చేస్తుంటారు. తాజాగా ఆర్థిక నేరగాడు సుఖేశ్‌ చంద్రశేఖరన్‌ కేసులో మరో హీరోయిన్‌ పేరు బయటకు వచ్చింది.
 
తాజాగా 200కోట్ల రూపాయల మోసం కేసులో బాలీవుడ్‌ నటి నోరా ఫతేహీని దిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ను ఈ కేసులో విచారిస్తున్నారు. నోరా ఫతేహీ కూడా సుకేశ్ చంద్రశేఖరన్‌ నుంచి బహుమతులు తీసుకుందట. ఈడీ అధికారులు గతంలోనూ సుకేశ్, నోరాను విచారించారట. అయితే నోరా మాత్రం తాను సుకేశ్‌తో కనీసం మాట్లాడలేదని చెబుతోందట. అంతే కాదు.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తోనూ తనకు ఎలాంటి సంబంధంలేదని అంటోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: