కాకినాడ జిల్లాలోని కేంద్రీయ విద్యాలయంలో కొందరు పిల్లలు అస్వస్థతకు గురయ్యారని.. కానీ ఈ విషయంలోనూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. అస్వస్థత‌కు గురై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కేంద్రీయ విద్యాలయం విద్యార్థులను ఆయన ఎంపీ వంగా గీతతో కలసి పరామర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కురసాల కన్నబాబు ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు.


పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్ధారించారని కురసాల కన్నబాబు తెలిపారు. కొంతమంది విష వాయువు అంటూ రూమర్స్‌ ప్రచారం చేస్తున్నారన్న కన్నబాబు.. అదంతా తప్పుడు ప్రచారమని తేలిందని తెలిపారు.  419 మంది విద్యార్థులున్న పాఠశాలలో కేవలం రెండు తరగతుల్లో 18 మంది మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. కారణం విష వాయువులు కాదని.. కారణం ఏంటనేది కమిటీ నిర్ధారిస్తుందని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: