రిలయన్స్ గ్రూపు మరో ముందడుగు వేసింది. ఇంధన రంగంలోకి వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సెన్స్‌హాక్‌ సంస్థలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయబోతంది. ఈ మేరకు వాటాల కొనుగోలు కోసం ఆ సంస్థతో రిలయన్స్‌ ఒప్పందం కుదుర్చుకొంది. సెన్స్‌హాక్‌ సంస్థ దాదాపు 79.4 శాతం వాటాను రిలయన్స్ కొనబోతోందట.

రూ. 255.57 కోట్లు వెచ్చించి ఈ కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్‌ సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2018లో స్థాపించిన సెన్స్‌హక్‌ సంస్థ సోలార్ ఎనర్జీ పరిశ్రమకు సాఫ్ట్‌వేర్‌ ఆధారిత మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ను అభివృద్ధి చేస్తూ వస్తోంది. సోలార్‌ ప్రాజెక్టులను ప్రణాళిక దశ నుంచి ఉత్పత్తి స్థాయికి చేర్చే ప్రక్రియను వేగవంతం చేసేందుకు సెన్స్‌హాక్‌ సంస్థ తోడ్పాటు ఇస్తోంది. సోలార్ ఎనర్జీ ఆస్తుల నిర్వహణ సేవలను సెన్స్‌హాక్‌ అందిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: