కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్ వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనపై తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమిత్‌ షా పర్యటనపై సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ స్పందించారు. 74 ఏళ్ల క్రితం ఆనాటి కేంద్ర హోం మంత్రి తెలంగాణను భారత్‌లో కలిపారన్న కేటీఆర్‌.. తాజా ఈనాటి కేంద్ర హోం మంత్రి తెలంగాణను విభజించి, బెదిరించేందుకు వచ్చారంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.


ఇప్పుడు దేశానికి కావల్సింది విభజన రాజకీయాలు కాదన్న మంత్రి కేటీఆర్‌.. దేశానికి నిర్ణయాత్మక విధానాలు కావాలంటూ చురకలు వేశారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి తరచూ తెలంగాణను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్‌ బీజేపీపై రాజకీయంగా విరుచుకుపడుతోంది. ఢీ అంటే ఢీ అంటోంది. ఈనేపథ్యంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: