ఏపీ సీఎం జగన్ ఆ టీచర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఏపీలోని 1,145 ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేసేశారు. అంటే ఇకపై ఏపీ పాఠశాలల్లో ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ ఉపాధ్యాయు ఉండరన్నమాట. అయితే.. జాతీయ నూతన విద్యా విధానంలో ఈ ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ టీచర్‌ పోస్టులకు ప్రాధాన్యం ఉంది. అలాంటి పోస్టులను ప్రభుత్వం రద్దు చేయడంతో.. ఆయా విభాగాల ఉపాధ్యాయుల్లో ఆందోళన కనిపిస్తోంది.

ఎలాంటి పోస్టులు రద్దు చేయబోమని ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినా.. ఇప్పుడు ఈ  పోస్టులు రద్దయ్యాయి. గతేడాది కూడా అక్టోబరులో ఐదుగురు అదనపు డైరెక్టర్ల కోసం 15 పోస్టులను రద్దు చేశారు.  ఇప్పటివరకు మొత్తం  1,160 పోస్టులను రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఈ విభాగాల్లో ఇంకా 840 పోస్టులు మాత్రమే మిగిలినట్టు సమాచారం. ఈ పోస్టుల్లో 350 పోస్టుల్లో రెగ్యులర్‌ ఉపాధ్యాయులు ఉన్నారు. వీటికి అదనంగా పోస్టులు వస్తాయనుకుంటే ఇప్పటికే ఉన్న పోస్టులను రద్దు చేయడమేంటని ఉపాధ్యాయులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: