ఈనెల 27వ తేదిన విడుదలైన సీఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థి అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో మొత్తం 86మంది ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. అలాగే సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో రెండో ర్యాంకుతో పాటు మొదటి 50ర్యాంకుల్లో 31మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులున్నట్లు ఆయన వివరించారు. రెండు విభాగాల్లో కలిపి మొదటి 10 ర్యాంకుల్లో 8ర్యాంకులు కైవసం చేసుకున్నట్లు తెలిపారు.


సీఎంఏ ఫలితాల్లో గుంటూరు శ్రీమేధ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు సంస్థ ఛైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. ఈనెల 27న విడుదలైన ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నందకిషోర్.. శ్రీమేధకు చెందిన చంద్రప్రకాష్ సీఎంఏ ఫైనల్స్ లో అఖిలభారత స్థాయిలో 15వ ర్యాంకు, లోకేష్ దత్త 36వ ర్యాంకు, శిరీష్ కుమార్ 37వ ర్యాంకు, వెంకటరమణ 38వ ర్యాంకు, నాగార్జున 46వ ర్యాంకు సాధించినట్లు వివరించారు. సీఎంఏ ఇంటర్లో విభాగంలో భాస్కర్ 45వ ర్యాంకు సాధించారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: