చంద్రబాబు అవినీతి పాలన వలనే వైసీపీ కి ప్రజలు 151 సీట్లు కట్టబెట్టారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు.. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా అభివృద్ధి, సంక్షేమం అమలుకు నిధులు కొరత లేదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు.


పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపాలెం లో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి బూడి ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ ప్రసంగించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కిందని మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. టిడిపి అధికారంలో పథకం అమలు జరగాలి అంటే సొంత పార్టీ వారు కూడా  లంచం ఇవ్వాల్సిన దుస్థితి కొనసాగిందని మంత్రి బూడి ముత్యాల నాయుడు గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: