దేశాన్ని ఎన్ని పార్టీలు పాలించినా అసమానతలు అలాగే ఉన్నాయా.. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా పరిస్థితులు చెప్పుకోవాల్సినంతగా మారలేదా.. అవునంటున్నారు  కేంద్ర మంత్రి నారాయణ స్వామి. దేశంలో అంటరానితనం, సాంఘిక బహిష్కరణలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు. స్వతంత్ర భారతంలో అమృత్ మహోత్సవం గొప్ప కార్యక్రమమని కేంద్ర మంత్రి నారాయణ స్వామి అన్నారు. సమాజంలో సంస్కరణల ద్వారానే  మార్పు సాధ్యమన్నారు.


మన దేశంలో రాజ్యాంగ బద్దమైన విధానాలు పూర్తిగా అమలు అవడం లేదని కేంద్ర మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. ఆది ఆంధ్ర సమ్మేళనం 105 సంవత్సరాలు అయిన సందర్భంగా విజయవాడ నగరంలోని సిద్దార్ధ ఆడిటోరియం సామాజిక సమరసత సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ భువనేశ్వరి పీఠాధీపతులు కమలానంద భారతీ స్వామి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఉప సభపతి మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: