ఇవాళ దిల్లీలో జాతీయ జలఅభివృద్ధి సంస్థ 70వ గవర్నింగ్ బాడీ సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరగనున్న ఆ సమావేశానికి అన్నిరాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు, ఈఎన్సీలు పాల్గొంటారు. గతంలో జరిగిన 69వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, బడ్జెట్, నిర్వహణపర అంశాలు దేశవ్యాప్తంగా ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధాన ప్రణాళికలు, వాటి పురోగతిని ఈ సమావేశంలో కూలంకషంగా చర్చిస్తారు.


గోదావరి-కావేరీ అనుసంధానానికి సంబంధించి ఇటీవల తీసుకొచ్చిన ప్రత్యామ్నాయ ప్రతిపాదన కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్ర జలసంఘం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. తన వాటాలో ఛత్తీస్‌ఘడ్ వినియోగించుకోని నీటిని మాత్రమే కావేరికి ఇచ్చంపల్లి నుంచి మళ్ళిస్తామని జాతీయ జలఅభివృద్ధిసంస్థ ప్రతిపాదించింది. ఇవాళ్టి సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 40పనులకు సంబంధించిన అంశాలు సమావేశం అజెండాలో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: