వైద్యో నారాయణో హరి అంటారు.. అంటే వైద్యుడు సాక్షాత్తూ నారాయణుడితో సమానం అని అర్థం.. అవును మరి. నారాయణడు ఈ జన్మ ఇస్తే.. దానికి పునర్జన్మ ఇచ్చే సామర్థ్యం కలిగిన వారే వైద్యులు. ఎందరో రోగులను మృత్యుముఖం నుంచి తమ వైద్యంతో వారు కాపాడతారు. కర్నూలు నగరంలోని వైద్యులు తాజాగా అలాంటి ఓ అద్భుతం చేశారు.

కర్నూలు గౌరీ గోపాల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గిడ్డోజీరావు అనే వ్యక్తి కొన్నాళ్లుగా  గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నారు. ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్తే వైద్యులే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ఆయనకు ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపుకు, ఎడమవైపున ఉండాల్సిన లివర్ కుడివైపున ఉంది. దీంతో వైద్యులు ఎంతో శ్రమకోర్చి బీటింగ్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. ఇలాంటి సమస్య చాలా అరుదుగా ఉంటుందని వైద్యులు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సర్జరీలు ఆరు మాత్రమే చేశారట. ప్రపంచవ్యాప్తంగా కేవలం 16 మందికి మాత్రమే చేశారట. అలాంటి వైద్యం చేసి ఆ రోగిని బతికించారు. గ్రేట్ కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: