పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఓ క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన పోలవరం ప్రాజెక్టు అధారిటీ సమావేశంలో నిర్మాణంపై ఓ స్పష్టత వచ్చింది. వర్కింగ్ సీజన్ లో పోలవరం ప్రాజెక్టు పనుల లక్ష్యాలు, వనరులపై పీపీఏ సమావేశంలో చర్చించామని.. ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలిపారు. వర్కింగ్ సీజన్ లో పనుల కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదించామని.. దిగువ కాపర్ డ్యాం పనులను జనవరి నెలాఖరు వరకు పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్ కుమార్ వివరించారు.


అలాగే ప్రధాన డ్యాంకు సంబంధించిన పనుల ప్రారంభం కోసం డయాఫ్రామ్ వాల్ పరిస్థితిని పరీక్షిస్తామన్న ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్ కుమార్... 2023 జూన్ వరకు ప్రధాన డ్యాం పనులు గ్రౌండ్ లెవల్ వరకు తీసుకొస్తామన్నారు. ప్రధాన డ్యాం గ్యాప్ పనులను 2023 డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్ కుమార్ అంటున్నారు. అంటే 2024లో పోలవరం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: