బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య పోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. సిట్‌ పేరుతో బీజేపీ నేతలను ఇబ్బంది పెట్టాలని టీఆర్ఎస్‌ సర్కారు ప్రయత్నిస్తుంటే.. ఈడీ, సీబీఐ పేరుతో తెలంగాణ మంత్రులను కేంద్రం వణికిస్తోంది. తాజాగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మల్లారెడ్డి నివాసమే కాదు..  హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ తెల్లవారు జాము నుంచే అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు.


తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లలో.. సంస్థల్లో ప్రధానంగా సోదాలు చేస్తున్నారు. కొంపల్లిలోని పాం మెడోస్‌ విల్లాలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 వరకూ బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ ఆఫీసుల్లోనూ.. నిన్న మంత్రి తలసాని సోదరుడిని కేసినో కేసులోనూ విచారించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈడీ దూకుడు తెలంగాణ మంత్రుల్లో గుబులు రేపుతున్నట్టుగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: