వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. తన తండ్రి హత్య కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన కేసులో జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ తీర్పును వెల్లడించనుంది. సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై అక్టోబర్ 19న జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ ముగించింది. తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది.

 
వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కూడా సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే  కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తామని విచారణ సందర్భంగా ధర్మాసనం చెప్పింది. వివేకా హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ అంశంపై  తీర్పు ఇచ్చిన తరువాతే గంగిరెడ్డి బెయిల్ రద్దు పై విచారణ జరుపుతామని సుప్రీం ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: