రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మాక్స్ క్రిప్టో పేరుతో అధిక రాబడి ఆశ పెట్టి వందల సంఖ్యలో జనాలతో డబ్బు తీసుకొని పరారైన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగింది. బాధితుల కథనం ప్రకారం కాజా మొయినోద్దీన్, రాజీవ్ శర్మ అనే ఇద్దరు స్థానికంగా ఉన్న యువత ను నమ్మించి మోసం చేశారు. డబ్బు ఇన్వెస్ట్ చేస్తే 6 నెలల్లో 3 రేట్లు అధికంగా ఇస్తామంటూ మోసగించారు.


ఒక్కొక్కరి నుండి 50 వేల నుండి 20 లక్షల వరకూ వీరిద్దరూ వసూలు చేశారు.  కొన్నాళ్ల పాటు డబ్బులు ఇచ్చి  3 నెలలుగా ఇవ్వడం మానేశారు. దీంతో  డబ్బులు తిరిగి ఇవ్వమని నిలదీయగా   వారు బాధితులను బెదిరిస్తున్నారు. ఇలా సుమారుగా 15 కోట్ల  రూపాయలకు పైగా మోసపోయామని బాధితులు చెబుతున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: