పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్తున్న చంద్రబాబుని పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది పిరికి పంద చర్య అంటున్న నేతలు.. పోలవరం పాకిస్థాన్ లో ఉందా ? ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి ప్రజల తరపున పోరాడే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నిస్తున్నారు. నాడు విశాఖపట్నంలో రుషికొండపై జరుగుతున్నా తవ్వకాలను చంద్రబాబు గారు పరిశీలిస్తానంటే అడ్డుకున్నారుని.... నేడు మళ్ళీ పోలవరం ప్రాజెక్టుని పరిశీలిస్తానంటే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇవేమి చీకటి రాజకీయాలు.. అక్రమాలు జరగకపోతే భయమెందుకు.. తెలుగుదేశం ప్రభుత్వంలో 72 % పనులు పూర్తి చేశాము కాబట్టి నాడు ప్రజలకి కూడా ప్రాజెక్ట్ ఎలా సాగుతుందో చూపించాము .. నేడు వైసీపీ ఎందుకు అడ్డుకుంటుంది ? డయాఫ్రమ్ వాల్ ని నాశనం చేసింది నిజం కాదా ? 3.5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టారు ? ఎంత శాతం పూర్తి చేశారు ... రివర్స్ టెండరింగ్ తో సాధించిందేంటి ? నిర్వాసితులని ఇంకెన్నాళ్లు గాలికి వదిలేస్తారు ? జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో పోలవరానికి ఇదేం ఖర్మ ? అని టీడీపీ నేత చింతకాయల విజయ్ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: