ఏపీలో ప్రభుత్వం విపక్షాలను తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతోందన్న విమర్శలు ఉన్నాయి. పోలీస్‌ వ్యవస్థను జగన్ సర్కారు దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే జగన్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జనసేన తరఫున న్యాయవాదిని నియమిస్తున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.


అక్రమ కేసులకు జన సైనికులు ఏమాత్రం భయపడొద్దని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  ధైర్యం చెప్పారు. ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన నాయకత్వం రాదన్న జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ .. జనసేన బలోపేతానికి అందరూ కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. కోనసీమలో ఓ పెళ్లి  ఊరేగింపులో డీజే పెట్టుకుంటే దానిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం సహించరానిదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  అన్నారు. అభ్యర్థి ఎవరైనా  విజయానికి కృషి చేయాలని.. అంబేడ్కర్‌ జిల్లా అంబాజీపేటలో జరిగిన పి. గన్నవరం నియోజకవర్గ జనసేన సమావేశంలో మనోహర్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: