ఏపీలో సర్కారు ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపుల ఖర్చు గతంలో 5వేల కోట్లు ఉండేది. ఇప్పుడు ఆ ఖర్చు అది 7 వేల కోట్లకు పైగానే పెరిగింది. అయితే ఈ ఖర్చు ఏదైనా సర్కారు చెల్లించాల్సిందే. గతంలో రెగ్యులర్‌ ఉద్యోగికి ఒక టైం ఉండేది. మిగిలిన టెంపరరీ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉండేది.


వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని స్టీమ్‌ లైన్‌ చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. కానీ.. ఈ నెల మాత్రమే కొంత ఆలస్యం అయ్యిందని... ఆ విషయం ఉద్యోగులకు కూడా చెప్పామని... వాళ్లు కూడా అర్ధం చేసుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణాలో రకరకాలుగా చేస్తున్నారని.. ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక విధంగా జీతాల వ్యవహారం నడుస్తోందని సజ్జల అన్నారు. ఉద్యోగులు మొదటి వారంలో జీతాలు రావాలనుకోవడంలో తప్పులేదని... అలా ఇవ్వడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోందని సజ్జల అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: