తెలంగాణ పాలిటిక్స్ అంతా హాట్ హాట్ గా మారాయి. జాతీయ పార్టీ బీఆర్ఎస్ అని బిజీబిజీగా గడుపుతున్నారు కేసీఆర్. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ టీపీ పేరుతో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు వైఎస్ షర్మిల. ఆమె చేస్తున్న పాదయాత్ర అడ్డుకోడం.. దీంతో హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవడం చకచకా జరిగిపోయాయి. మరోవైపు షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఆమె తుమ్మలకు షాక్ ఇవ్వబోతుందని జోరుగా ప్రచారం జరుగుతంది.


ఓటమి తర్వాత.. తుమ్మల నిశ్శబ్దంగా ఉంటే.. పిలిచి మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. ఆమధ్య తుమ్మల పార్టీ మారుతామనే ప్రచారం జరిగింది. కానీ పాలేరు వెళ్లి జెండా ఎగురవేసి.. టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు పాలేరు నుంచే షర్మిల పోటీ చేయబోతుందని ప్రచారం జరుగుతోంది. పాలేరులో చాలామంది ఆంధ్రా సెట్లర్స్ ఉన్నారు. అందుకే తుమ్మల అక్కడ్నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తుంటే ఆయనకు ప్రత్యర్థిగా షర్మిల బరిలో దిగే ఛాన్స్ ఏర్పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: