ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని మరో మూడు రాష్ట్రాలుగా విభజించే దిశగా తీసుకెళుతున్నాయని... దీనివలన ఆంధ్రజాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫారం రాష్ట్ర అధ్యక్షులు నేతి మహేశ్వరరావు అంటున్నారు. రాష్ట్రంలో కులాలు ముందు.. రాజకీయ పార్టీలు తరువాత.. ఆఖరులో ఆంధ్రవాదం ఉంటున్నాయని ఆయన వాపోయారు. కులం, రాజకీయ పార్టీల కంటే ముందు ప్రతి ఒక్కరిలో ఆంధ్రవాదాన్ని ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫారం రాష్ట్ర అధ్యక్షులు నేతి మహేశ్వరరావు అన్నారు.


పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశారని నేతి మహేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. చివరకు పొట్టి శ్రీరాములు కొంతమంది ఒక కులానికి ఆపాదిస్తున్నారని.. ఆయనకు కులం కంటే ముందు ఆంధ్రజాతి అంటే అపారమైన ప్రేమ ఉందని నేతి మహేశ్వరరావు అన్నారు.  పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తిని నింపే ప్రయత్నం ప్రభుత్వం చేయాలన్నారు. ప్రభుత్వాలే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని.. రాష్ట్రంలో ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారని నేతి మహేశ్వరరావు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

AP