పాకిస్థాన్ వైఖరే.. పక్షపాత ధోరణి అని ముద్రపడిపోయింది. కాకపోతే ఇలాంటి అపవాదు నుంచి తప్పించుకునేందుకు పాక్ ప్రయత్నిస్తుంది. భారత్ దారిలోనే దాయాది దేశం వెళ్లేందుకు చూస్తుంది. భారత్ చేసే పనులను తీవ్రంగా వ్యతిరేకించే పాక్.. ఇప్పుడు భారత విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ పదే పదే భారత విదేశాంగ విధానాలను పొగిడేస్తున్నారు. ఈ ఎఫెక్టే అనుకుంటా.. అక్కడి ప్రభుత్వం భారత విదేశాంగ విధానాన్ని ఫాలో అయిపోతుంది.

అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు సిద్ధమవవుతోంది. ఏ దేశంతోనూ అతిగా శత్రుత్వానికి ముందుకు పోవట్లేదు. చైనా చెప్పుచేతల్లో ఉన్న పాక్... చైనా శత్రువైన అమెరికాతోనూ స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకుంటుంది. యూరప్ దేశాలు చమురు అందిస్తున్నా... రష్యాకు వ్యక్తిని పంపి అక్కడ్నుంచి చమురు కొంటామంటోంది పాక్.అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనైనా.. దేశ ఆర్థిక పరిస్థితిని మార్చవచ్చని భావిస్తుంది పాక్ ప్రభుత్వం.


మరింత సమాచారం తెలుసుకోండి: