తెలంగాణలో మరో మంచి కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. నేటి నుంచి కేసీఆర్‌ పౌష్టికాహార కిట్ల పంపిణీ చేయనున్నారు. తొలి విడతగా 9 జిల్లాల్లో కేసీఆర్‌ పౌష్టికాహార కిట్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. గర్భిణుల్లో రక్తహీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో మొదట ఈ  కిట్లు పంపిణీ చేస్తారు. ఇప్పటికే తెలంగాణలో విజయవంతంగా కేసీఆర్‌ కిట్ల పథకం  అమలవుతోంది.


నేటి నుంచి కిట్ల పంపిణీకి వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. కామారెడ్డి కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌గా కార్యక్రమం ప్రారంభిస్తారు. కార్యక్రమాన్ని మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పోచారం ప్రారంభిస్తారు. ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న కేసీఆర్ కిట్ల పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకునేందుకు మహిళలు ముందుకు వస్తున్నారు. పేద గర్భిణులకు ఈ కిట్లు వరంగా మారాయి. ఇప్పుడు పోషకాహార కిట్లు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించడం మెచ్చుకోదగిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: