ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్ సంస్థ కొత్తగా సరసమైన ప్యాకేజీలు ప్రకటించింది. ఇక వీటి ప్రకారం 90 రూపాయలకే 20 ఎంబీపీఎస్‌ స్పీడ్ తో 400 GB ఇంటర్నెట్ నెట్ ఇస్తారు. అలాగే 190 రూపాయల కనెక్షన్ తీసుకున్న వారికి సెట్ టాప్ బాక్స్ కూడా ఉచితంగా ఇస్తారు. రూ. 249 కే 50 ఎంబీపీఎస్‌ స్పీడ్ తో 600 GB ఇంటర్నెట్ ఇస్తారు. రూ. 295 రూపాయలకు FTA చానల్స్ , 15 ఎంబీపీఎస్‌ స్పీడ్ తో 200జీబీ ఇంటర్నెట్ అందిస్తారు.


అలాగే త్వరలో  ఓటీటీలు కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు ఏపీ ఫైబర్ నెట్  సంస్థ  ఎండీ గౌతమ్‌రెడ్డి తెలిపారు. రూ. 299, 399,799 రూపాయలతో ఓటీటీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సదుపాయం కల్పిస్తారు. రూ. 499, 699,999.. రూపాయలకే ఓటీటీ తో పాటు ట్రిపుల్ ప్లే ప్యాకేజీలు అందిస్తారు. మరో  పది రోజుల్లో ఈ కొత్త స్కీం లు ప్రారంభిస్తారు. 19 వేల జనాభా పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో చివరి ఇంటి వరకు ఇంటర్నెట్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: