బీఆర్‌ఎస్ నేతలపై ఈడి, సిబిఐని ప్రయోగిస్తామని దొంగ స్వాములు చెప్పారని...వారు చెప్పినట్లే జరుగుతోందని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అంటున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించడంపై ఆయన స్పందించారు.  హైకోర్ట్ తీర్పుపై మా న్యాయవాది తో మాట్లాడానని.. ఇంకా కోర్టు తీర్పు కాపీ రాలేదని.. తీర్పు కాపీ వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఈడి విచారణలో ఎలాంటి అంశం దొరకలేదు కాబట్టే ఇప్పుడు సిబిఐ రంగంలోకి దింపుతున్నారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు.


న్యాయ వ్యవస్థ పై మాకు సంపూర్ణ నమ్మకం ఉందన్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. తీర్పు కాపీ వచ్చాక డివిజన్ బెంచ్ కు వెళ్లాలా లేక సుప్రీం కోర్ట్కు వెళ్లాలా అనేదాని పై నిర్ణయం తీసుకుంటామన్నారు. సిట్ ను తప్పించి సిబిఐకి ఇవ్వడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. ఈడి పరిధిలోకి రాకపోయినా నన్ను ఈడి విచారణకు పిలిచారన్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్న సాంకేతిక అంశాలు అడ్డు పెట్టుకుని బీజేపీ నేతలు విచారణకు రావడం లేదని.. ఈడి, సిబిఐ ఏది వచ్చినా మేము సిద్దంగా ఉన్నామని..తప్పు చేయనప్పుడు మాకు భయం అవసరం లేదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: