ఉజ్బెకిస్థాన్‌ పసిలో 18 మంది చిన్నారుల మరణాలకు ఓ భారత ఫార్మా సంస్థ రూపొందించిన దగ్గు మందు కారణమైంది. ఈ దగ్గు సిరప్‌ ను మరియన్‌ బయోటెక్‌ సంస్థ తయారు చేసింది. అయితే.. ఈ మందు తాగి తమ దేశానికి చెందిన 18 మంది చిన్నారులు మరణించినట్టు ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్య శాఖ ఆరోపించింది. దీంతో ఇప్పుడు ఆ సంస్థ మందు తయారీని నిలిపివేసింది. ఈ మరియన్‌ బయోటెక్‌ సంస్థ నొయిడాలో ఉంది.


ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణలతో మరియన్‌ బయోటెక్‌ ఫార్మాలో కేంద్ర సంస్థ బృందాలు, ఉత్తరప్రదేశ్‌ ఔషధ విభాగం తనిఖీలు నిర్వహించాయి. అయితే.. ఈ సిరప్‌ను భారత్‌లో విక్రయించటం లేదని మరియన్‌ బయోటెక్‌ తెలిపింది. కేవలం ఉజ్బెకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నట్లు మరియన్‌ బయోటెక్‌ తెలిపింది. ఈ ఘటనపై  కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ కూడా దర్యాప్తు ప్రారంభించింది. అయితే..  తమవైపు నుంచి ఎలాంటి సమస్య లేదని మరియన్‌ బయోటెక్‌ చెబుతోంది. పదేళ్లుగా ఉజ్బెకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నట్లు మరియన్‌ బయోటెక్‌ ప్రతినిధి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: