జీ-20 గ్రూప్ ప్రారంభ సమావేశం త్వరలో హైదరాబాద్‌లో జరగనుంది. జీ-20 సభ్య దేశాల ప్రతినిధులు, పరిశీలకుల దేశాల నుంచి తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులు, బహుళ పక్ష సంస్థల ప్రతినిధులు, భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు. రాబోయే సంవత్సరాల్లో జీ-20 దేశాలతో పాటు ప్రపంచ దేశాల్లో వ్యవస్థాపకత, ఆవిష్కరణల రంగాలకు ప్రాధాన్యత ఉంటుందని అంచనా వేసిన నేపథ్యంలో అభివృద్ధికి దోహదపడే విధాన నిర్ణయాలను ఎంగేజ్మెంట్ గ్రూప్ సిఫార్సు చేస్తుంది.
స్టార్టప్ - 20లో ఫౌండేషన్, అలయన్స్ టాస్క్‌ఫోర్స్, ఫైనాన్స్ ,ఇన్‌క్లూజన్, సస్టైనబిలిటీ పేరిట మూడు ప్రధాన టాస్క్‌ఫోర్స్‌లు పనిచేస్తాయి. స్టార్టప్‌లకు మూలధన పెట్టుబడులు సమకూర్చడం, ప్రారంభ-దశ స్టార్టప్‌లకు ప్రత్యేకంగా ఆర్థిక, పెట్టుబడి వనరులు అందుబాటులోకి తెచ్చి స్టార్టప్‌లకు మూలధనం లభ్యత పెంచడం లక్ష్యంగా ఫైనాన్స్ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుంది. ప్రపంచ పెట్టుబడి రంగంలో స్టార్టప్‌ల కోసం పెట్టుబడులు ఆకర్షించడానికి అవసరమైన సౌకర్యాలను ఫైనాన్స్ టాస్క్‌ఫోర్స్ కల్పిస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: