బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల వాల్మీకి బోయ ఐక్య కార్యాచరణ కమిటీ థ్యాంక్స్ చెబుతోంది. ఈ తీర్మానానికి సహకరించిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , అల్లంపూర్ ఎమ్మెల్యే అబ్రహం,  రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య చైర్మన్ గట్టు తిమ్మప్పలకు.. కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బోయ కులస్తులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని... పక్క రాష్ట్రమైన కర్ణాటకలో బోయలు ఎస్టీలుగా ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు కూడా వచ్చేవి కావని వారు అంటున్నారు.


బోయల 60 ఏళ్ల కళను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని..  గతంలో ఎస్టీలుగా ఉన్న బోయలను బీసీలలో కలిపి గత పాలకులు తీవ్ర అన్యాయం చేశారని ఆ కులాల నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపకుండా వెంటనే పార్లమెంట్ ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆ కులాల నేతలు కోరారు. ఈ సందర్భంగా... ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళను నెరవేర్చిందుకు వాల్మీకి బోయలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆ కులాల నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr