చిన్నజీయర్ స్వామిని కేసీఆర్‌ అవసరానికి వాడుకుని వదిలేశారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాల్లో ప్రభుత్వ పాత్ర లేకుండా భక్తుల పాత్ర ఉండేలా చేస్తామని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అంటున్నారు. కొండగట్టు నుంచి కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారంటున్న లక్ష్మణ్... తెలంగాణ భక్తులు హుండీలో వేసింది కాకుండా ఆలయాల అభివృద్ధికి ఇచ్చిన నిధులు ఎంత అనే వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


నువ్వు వందల కోట్లు విడుదల చేస్తే ప్రజలు ఇచ్చిన డబ్బు ఏం చేస్తున్నట్లని లక్ష్మణ్ ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ నేతలు హిందూ దేవతలను కించపరిస్తున్నా భారాస చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను తెలంగాణకు ఆహ్వానించారని.. గతంలో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ బస్తీ దవాఖానాలు భేష్ అన్నారని.. ఇప్పుడు వచ్చి భగవంత్ మాన్  కాళేశ్వరం ప్రాజెక్టును పొగుడుతున్నారని...నేను నిన్ను పొగుడుతా.. నువ్వు నన్ను పొగుడు అన్నట్లు వారి తీరు మారిందని లక్ష్మణ్‌ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: