మంత్రి అంబటి రాంబాబుకి కనీస మానవత్వం లేదంటున్నారు  నాదెండ్ల మనోహర్..సత్తెనపల్లిలో డ్రైనేజిలో పడి మరణించిన కార్మికుడు అనిల్ కుటుంబానికి రూ.5లక్షల ప్రభుత్వ పరిహారం ఇచ్చిందని.. కానీ.. పరిహారంలో మంత్రి అంబటి సగం వాటా అడిగినట్లు ఆరోపణలు వచ్చాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రి అంబటిపై ఆరోపణలు చేసిన అనిల్ తల్లిదండ్రులు, గంగమ్మ, పర్లయ్య.. పరిహారం చెక్కు కూడా మంత్రి అంబటి వెనక్కు  పంపించారన్నారు.


ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన జనసేన.. గంగమ్మ, పర్లయ్యకు జనసేన నేతల రూ.4లక్షల ఆర్థిక సాయం అందించింది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి బాధితులకు జనసేన సాయం అందించింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ చెక్ అందజేశారు. ముఖ్యమంత్రికి మానవత్వం ఉంటే ఈ ఘటనపై స్పందించాలన్న నాదెండ్ల మనోహర్ ... ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5లక్షలు అందించాలన్నారు. ప్రభుత్వం అండగా లేకపోయినా మా పార్టీ నేతలు అండగా నిలిచారని.. వారందరినీ పార్టీ తరపున, పవన్ కళ్యాణ్ తరపున అభినందిస్తున్నానని నాదెండ్ల మనోహర్  అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: