మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు శైవ క్షేత్రాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాలనుంచి  3800 ప్రత్యేక బస్సులు ఏపీఎస్‌ ఆర్టీసీ నడుపుతోంది. వీటిలో కోటప్పకొండకు 675 బస్సులు, శ్రీశైలంకు 650 బస్సులు, కడప జిల్లాలోని పొలతలకు 200 బస్సులు, పట్టి సీమకు 100 బస్సులు ఏపీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటు చేసింది.


సాధారణ ఛార్జీలతోనే  ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఏపీఎస్‌ ఆర్టీసీ  ఎం.డి.  ద్వారకా తిరుమల రావు తెలిపారు. రాష్ట్రంలోని 101 శైవ క్షేత్రాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా  వేస్తున్నామని ఏపీఎస్‌ ఆర్టీసీ  ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్సు స్టేషన్ల ఏర్పాటు చేశామని.. ప్రయాణీకుల రద్దీని బట్టి అదనపు ట్రిప్పులు, బస్సులు సిద్ధం చేశామని.. ఘాట్ రోడ్డులలో నైపుణ్యం కల్గిన డ్రైవర్లతో బస్సుల ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఎండీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: