టిబి నియంత్రణలో ఉత్తమ  ప్రతిభ కనబరిచినందుకు తెలంగాణ లోని నాలుగు జిల్లాలకు కేంద్రం అవార్డ్ లు ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా బంగారు, భద్రాద్రి, హన్మకొండ జిల్లా వెండి, ఖమ్మం జిల్లా కాంస్య పతకాలకు ఎంపికయ్యాయని కేంద్రం తెలిపింది. ప్రపంచ టిబి దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఉత్తర ప్రదేశ్ వారణాసిలో జరిగిన  జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో  రాష్ట్ర టిబి విభాగం జెడి డాక్టర్ రాజేశం , నిజామాబాద్ డిఎంహెచ్ ఓ సుదర్శనం ఈ అవార్డ్ లను కేంద్రం నుంచి అందుకున్నారు.


టిబి నిర్ములన కార్యక్రమాల సూచికల ఆధారంగా  టిబి నిర్ములన లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ ప్రతిభకనబరుస్తున్న 3వ రాష్ట్రంగా నిలవడం విశేషమని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా టిబి నియంత్రణలో విశేష కృషి చేస్తున్న అధికారులను మంత్రులు అభినందించారు. 2025 నాటికి పూర్తి స్థాయి టిబి నిర్ములానే లక్ష్యమంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: