హర్రీ అప్‌.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆస్తిపన్ను చెల్లింపునకు ఇవాళే ఆఖరి రోజు.  ఇక ఇవాళ ఆస్తి పన్ను చెల్లించేందుకు చివరి రోజు కావడం వల్ల ఈ రాత్రి 11 గంటల వరకు అన్ని జీహెచ్ఎంసీ సర్కిల్, ప్రధాన కార్యాలయంలోని సిటిజన్ షిప్ కార్యాలయాలు తెరిచి ఉంటాయి. ఈ ఆర్థిక ఏడాది మొదటిలో రికార్డు స్థాయిలో వసూళ్లు అయినా....ఏడాది చివరికి మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు కాలేదట. ఆర్థిక ఏడాదిలో మొత్తం 1600 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను మాత్రమే వసూళ్లయిందని లెక్కలు చెబుతున్నాయి.


2022-23 ఆర్థిక ఏడాదిలో 2వేల కోట్ల టార్గెట్ పెట్టుకోగా కేవలం 80 శాతం మాత్రమే పూర్తయిందని లెక్కలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రెండు వేల కోట్ల రూపాయలు. ఇప్పటి  వరకు 1600 కోట్ల రూపాయలు మాత్రమే వసూల్ అయ్యాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: