మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలిలో మాట్లాడారు. హైద్రాబాద్ అబిడ్స్ లోని రెడ్డి వసతి గృహ సమావేశ మందిరంలో... రెడ్డి జన సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మరోసారి రచ్చ రచ్చ చేశారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ ఫేమస్ మంత్రి కేటీఆర్ అని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. కేటీఆర్ వల్లే గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ లాంటి ఎన్నో కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. యువత తీరుపై తనదైన శైలిలో స్పందించారు. చిరిగిన జీన్స్ వేసుకొని పబ్‌లు, హోటల్స్, అమ్మాయిలతో తిరిగితే యువత ఫేమస్ అవుతారని మంత్రి మల్లారెడ్డి అన్నారు.


తనకు ఏ సంస్థ నుంచి నిధులు అందడం లేదని... తన వద్ద బ్యాంకు బ్యాలెన్స్, ల్యాండ్ బ్యాంక్, యువత బ్యాంక్ ఉందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కష్టపడితేనే యువత ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారని మంత్రి మల్లారెడ్డి సూచించారు. దేశంలో ఉన్న బిలియనీర్లంతా పాతికేళ్ల కుర్రాళ్లేనని మంత్రి మల్లారెడ్డి గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: