విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టీజన్స్ సమ్మె విరమించారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తుంది తామేనని, తమకు ఫిట్ మెంట్ విషయంలో సరైన న్యాయం జరగలేదని, అనేక ఏళ్లుగా ఉన్న సమస్యలు కూడా పరిష్కరించడంలేదని ఆర్టీజన్లు ఈనెల 26 నుంచి సమ్మె చేస్తున్నారు. నిన్న ట్రాన్స్ కో -జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుతో వారు చర్చలు జరిపారు. సమ్మె విరమిస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు తెలిపారు.


ఎం.ఐ.ఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే బల్లాల హామీ మేరకు తాము సమ్మె విరమిస్తున్నట్లు ఎస్.సాయిలు ప్రకటించారు. తమ సమస్యలను సీఎం కేసీఆర్ తో మాట్లాడి పరిష్కరిస్తామని వారు తెలిపారని ఎస్.సాయిలు అన్నారు. వారి హామితో సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఉందని..  అందుకే ఎమ్మెల్యే బల్లాలతో కలిసి విద్యుత్ సౌధకు వచ్చిన ఆర్టీజన్లు సీఎండీ ప్రభాకర్ రావును కలిసి చర్చించిన తర్వాత సమ్మె విరమిస్తున్నట్లు ఎస్.సాయిలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: