తెలంగాణ రాష్ట్రంలో ఆకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించి క్షేత్రస్థాయిలో పంటనష్టం తీవ్రతను అంచనా వేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ రెడీ అయ్యింది. దీని కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి, ప్రత్యక్షంగా పరిస్థితులను పరిశీలించి, పంట నష్టం వివరాలు, పంటల కొనుగోళ్లలో జరుగుతున్నఆలసత్వం తదితర అంశాలపై నివేదికలు ఇస్తాయి.


ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్‌ల నేతృత్వంలో నాలుగు కమిటీల ఏర్పాటు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డిల ఆధ్వర్యంలో సమన్వయం కమిటీ ఏర్పాటు చేసినట్లు రేవంత్‌ రెడ్డి వివరించారు. క్షేత్ర స్థాయిలో పంటల నష్టం వివరాలు అంచనా వేసిన తరువాత పంట కొనుగోలు, ప్రభుత్వ నిర్లక్ష్యం తదితర అంశాలపై కమిటీలు ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వానికి పీసీసీ నివేదిక ఇవ్వడంతోపాటు వాటిని పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేస్తుందని రేవంత్‌ రెడ్డి  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: