నారా లోకేశ్ పాదయాత్రపై విమర్శలు వస్తున్నాయి. కడప జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యింద‌ని వైసీపీ నేతలు అంటున్నారు. రైతులకు, ప్రజలకు లోకేష్ పాదయాత్ర గుదిబండగా తయారైంద‌ని వారు విమర్శిస్తున్నారు. యువగళం పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నార‌ని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రోజుకు గంటన్నర‌లో పాదయాత్ర పూర్తి చేసిన ఘనుడు నారా లోకేష్‌ మాత్రమేనని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు.


చివరకు.. ప్రజలు లేక పాదయాత్ర పూర్తి చేసుకుని నిద్ర పోయారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైయ‌స్ జగన్ పాదయాత్ర కు లోకేష్ పాదయాత్ర కు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉంద‌ని వైసీపీ నేతలు చెబుతున్నారు. నారా లోకేశ్‌ ఫోటోలకు ఫోజులు తప్ప యాత్ర లేదని అన్నారు. కులాల వారిగా లోకేష్ సమావేశాలు పెట్టుకోవడం తప్ప లోకేశ్‌ చేసిందేమీ లేదని వారు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: