మళ్లీ బడులు ప్రారంభం అయ్యాయి. ఏపీలో పేద పిల్లలకు జగన్ మావయ్య కానుకలు అందబోతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభం తొలిరోజే జగన్ ప్రభుత్వం విద్యా కానుక అందిస్తోంది. జగన్ సీఎం అయ్యాక వరుసగా నాలుగో ఏడాది ‘జగనన్న విద్యాకానుక’ కిట్‌ను అందజేస్తున్నారు.

ఈ కానులకు ఏంటంటే..  ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు ఇస్తారు.  నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్ కూడా ఇస్తారు. అలాగే  కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు అందిస్తారు. వీటితో పాటు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని 6 నుంచి10 తరగతి పిల్లలకు కానుకగా ఇస్తారు. అలాగే పిక్టోరియల్‌ డిక్షనరీని 1–5 తరగతి పిల్లలకు అందిస్తారు. ఇలాంటి జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న సోమవారం నుంచే మొదటిరోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందించేయడం మంచి పరిణామమే.

మరింత సమాచారం తెలుసుకోండి: