సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభంజనం చూసి పచ్చ బ్యాచ్‌కు వణుకు మొద‌లైంద‌ట. పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ మాటలు అంటున్నారు. రాష్ట్రంలో వైయ‌స్ జగన్‌ ప్రభంజనం చూసి పచ్చ బ్యాచ్‌కు వణుకు పుడుతుందన్న మంత్రి ఆదిమూలపు సురేష్..తోడేళ్ళ గుంపు తోడై జగనన్న సంకల్పాన్ని అడ్డుకోవాలని చూసినా పట్టుదలతో ముందుకెళుతోందని అన్నారు. పేదల పట్టాభిషేకం ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు చూశామని.. టీడీపీకి ఓటు బ్యాంకు రాజకీయాలే కానీ పేదలంటే ప్రేమ లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.


ఎన్నికల ముందు ప్రకటనలు చేశారని.. ఆ తర్వాత మ్యానిఫెస్టోని టీడీపీ నేతలు తగలబెట్టారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టిడ్కో ఇళ్ళను చంద్రబాబు గాలికొదిలేస్తే జగనన్న వారి కలను సాకారం చేశారని మంత్రి ఆదిమూలపు సురేష్ అంటున్నారు. ప్రజల కోసం ఆలోచించే మనసున్న మనిషి జగనన్న, జగనన్న ఇళ్ళను కాదు ఊళ్ళను నిర్మించారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: