సింగరేణి సంస్థ తెలంగాణలో లక్షల మందికి ఉపాధి కల్గిస్తోంది. అలాంటి సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై రామగుండం వైద్య కళాశాలలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబిబిఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఈ మేరకు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజిలో మొత్తం 150 ఎంబిబిఎస్ సీట్ల ఉన్నాయి. వాటిలో 5% సీట్లను కేటాయిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 7 సీట్లను సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేసీఆర్‌ ప్రభుత్వం  కేటాయించనుంది.

నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను  పరిగణలోకి తీసుకోనున్నట్టు కేసీఆర్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. సింగరేణి ఉద్యోగుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్‌ ప్రభుత్వం..  ఈమేరకు  రిజర్వేషన్ కల్పించినట్టు వైద్య ఆరోగ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR