కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దేనని మంత్రి కేటీఆర్ అంటున్నారు. రైతన్నలకు 3 గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ విధానంపై ప్రతి గ్రామంలో చర్చ జరగాలంటున్న కేటీఆర్.. ఎకరానికి గంట విద్యుత్తు చాలన్న కాంగ్రెస్ నేతల మాటలు రైతులను అవమానించడమేనంటున్నారు. రైతులను అవమానించిన కాంగ్రెస్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పేలా తీర్మానాలని మంత్రి కేటీఆర్ సూచిస్తున్నారు.


24 గంటల ఉచిత విద్యుత్తు వద్దన్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ కుట్రను  రైతాంగానికి వివరించాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ సూచించారు. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా..? కరెంట్ వెలుగుల భారాస కావాలా? తెలంగాణ రైతులు తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీ శ్రేణులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల17 నుంచి పది రోజులపాటు భారాస రైతు సమావేశాలు ఉంటాయని.. ప్రతీ రైతువేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: