హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహించబడుతున్నటువంటి కొన్ని ఆటిజం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ మరియు రిహాబిలిటేషన్ సెంటర్లపై Kukatpally, Suchitra Circle, BK Guda Dilsukhnagar, uppal మరియు వివిధ ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, చిన్న పిల్లలలో సెన్సోరియల్ సమస్యలు, ఎదుగుదల లోపాలు మరియు మానసిక రుగ్మతలకు సంబంధిచినటువంటి ఇబ్బందులకు శాస్త్రీయ పద్దతిలో మాత్రమే థెరపిస్ ఇవాల్సిఉంటుంది. ఈ విషయాలపై చాలా మంది నిపుణులు అనేకమార్లు హెచ్చరించడం తెలిసిన విషయమే,
Sec - 52 RPWD Act 2016, ప్రకారం ఆటిజం ధెరపీ సెంటర్లకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని మరియు ప్రభుత్వ నిబంధనలు, స్టాండర్డ్ కు అనుగుణంగా ధెరపీ సర్వీసులు అందించగలిగే ఆటిజం ధెరపీ సెంటర్లు మాత్రమే ఇటువంటి థెరపిస్ ఇవాల్సిఉంటుందని అధికార్లుకూడా స్పష్టం చేశారు.
వీటి మీద సరయిన అవగాహన లేకుండా అక్రమంగా ఆటిజం థెరపిస్ అనే పేరుతో చిన్నపిల్లల భవిష్యత్తుతో ఆటలాడితే.. అది పిల్లల వారి తలిదండ్రుల, కుటుంబాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తుందని తెలిసిన తలితండ్రులు ఆందోళనలకు గురవుతున్నారు.
ఈ అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ లపై సరిఅయిన కఠిన చర్యలు తీసుకోవాలి అని నిపుణలు, తల్లిదండ్రుల కోరికల మేరకు అధికారులు సోదాలు చేపట్టారని సమాచారం.
2000 నాటికి 10,000 వేల పిల్లలలో సగటున 1 పిల్లాడికి మాత్రమే వచ్చిన ఈ ఆటిజం మహమ్మారి సమస్య .. నేడు ప్రతి 30 పిల్లలలో సగటున 1 పిల్లాడికి వస్తుంది