వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలిచేదెవరు.. ఈ అంశంపై టైమ్స్‌ నౌ చేసిన సర్వేలో షాకింగ్‌ ఫలితాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏపీలో వైసీపీకీ 24–25 ఎంపీ స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ సర్వే చెప్పింది. జూన్‌ 15– ఆగస్టు 12 మధ్య టైమ్స్‌ నౌ తాజా సర్వే నిర్వహించింది. అయితే ఏప్రిల్‌లో జరిగిన సర్వేలోనూ ఇవే ఫలితాలు రావడం విశేషం.


అయితే గతంతో పోలిస్తే.. వైసీపీ ఓట్ల శాతం 51.3 శాతానికి పెరిగినట్టు టైమ్స్ నౌ సర్వే తెలిపింది. దీంతో ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయమని టైమ్స్‌ నౌ సర్వే మరోసారి చెబుతోంది.  స్పష్టమైంది. ఏపీలో 24 నుంచి 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే.. ఈసారి 51.3 శాతం ఓట్లతో  ఒకటీ అరా మినహా మొత్తం స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని టైమ్స్‌ నౌ సర్వే చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: