గ్రేటర్ హైదరాబాద్ రెండో విడత రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ కలెక్టరేట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపిక జరగుతుంది. ఎన్ఐసీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో మంత్రులు, ఉన్నతాధికారులు, లబ్దిదారుల సమక్షంలో ఆన్ లైన్ డ్రా తీస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈ రెండో విడతలో ప్రభుత్వం 13,300 ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.


గత నెల 24 వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ లో మొదటి విడత లో 11,700 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ నెల 2 వ తేదీన 8 ప్రాంతాలలో ఇళ్లను అందించారు. నేటి ఆన్ లైన్ డ్రా లో ఎంపికైన లబ్ధిదారులకు 21 వ తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇళ్ల ను అందిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం డబుల్ బెడ్ రూమ్ ల కోసం 7 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 95 వేలు మాత్రమే అర్హులుగా నిర్ధారించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: