తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అర్వింద్‌ విరుచుకుపడ్డారు.. రేవంత్ రెడ్డి గురువు జైళ్లో ఉన్నారన్న బీజేపీ ఎంపీ అర్వింద్‌.. రేవంత్ రెడ్డి జీవితంలో మంత్రి కూడా కాలేరని.. ఆయన త్వరలోనే తన గురువులాగే జైలుకు వెళ్తారని అన్నారు. పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలో మాకు తెలుసని.. రేవంత్ రెడ్డి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ ఎంపీ అర్వింద్‌ అన్నారు.

పసుపు బోర్డు ఏమీ పని చేస్తుందో రేవంత్ రెడ్డికీ అవగాహన లేదని.. మంత్రిగా పని చేసిన అనుభవం రేవంత్ రెడ్డికి లేదని.. పసుపు పంటను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయేని బీజేపీ ఎంపీ అర్వింద్‌ అన్నారు. చెరుకు ఫ్యాక్టరీలను కనుమరుగు చేసింది టీడీపీ అని.. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఎప్పుడు వీడేది తెలియదని బీజేపీ ఎంపీ అర్వింద్‌ అన్నారు. సోనియా గాంధీ ఏమీ తెలంగాణ ఇవ్వలేదని బీజేపీ ఎంపీ అర్వింద్‌ అన్నారు. రేవంత్‌ను ప్రజలు కొడంగల్ లో తంతే.. మల్కాజిగిరిలో పడ్డారని.. సగం పార్లమెంట్ లలో కాంగ్రెస్ అడ్రస్ లేదు.. 61సీట్లు ఎక్కడి నుంచి వస్తాయని బీజేపీ ఎంపీ అర్వింద్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: